రాజన్న ఆలయం లోని దర్గాను తొలగించాలి.. బిజెపి జిల్లా అధ్యక్షుడు
రాజన్న సిరిసిల్ల, 4 అక్టోబర్ (హి.స.) అభివృద్ధి పేరుతో వేములవాడ రాజన్న ఆలయాన్ని మూసివేస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నాడు. వేములవాడ పట్టణంలోని బిజెపి రూరల్ మండల శాఖ కార్యా
వేములవాడ బిజెపి


రాజన్న సిరిసిల్ల, 4 అక్టోబర్ (హి.స.)

అభివృద్ధి పేరుతో వేములవాడ రాజన్న ఆలయాన్ని మూసివేస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నాడు. వేములవాడ పట్టణంలోని బిజెపి రూరల్ మండల శాఖ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధి పనుల తీరును ఖండించాడు. కోట్ల రూపాయలతో కాశీ, ఉజ్జయిని దేవాలయాలు అభివృద్ధి చేసినప్పుడు భక్తులకు దర్శనాలు నిలిపి వేయలేదని గుర్తు చేశారు. అలాగే రాజన్న భక్తులకు ఎట్టి పరిస్థితుల్లో దర్శనాలు నిలిపి వేయవద్దని, ఆలయాన్ని మూసివేస్తే వందలాది మంది భక్తులతో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. దేశంలోని ఏ మసీదులో హిందువుల సమాధులు లేవని, అందుకే వెంటనే రాజన్న ఆలయంలోని దర్గాను తొలగించాలని కోరాడు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande