జగన్‌ను ఫాలో అవుతున్న దళపతి విజయ్.. నెట్టింట చర్చ
అమరావతి, 4 అక్టోబర్ (హి.స.) తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్ డ్రెస్సింగ్ స్టైల్ విషయంలో ఏపీ మాజీ సీఎం జగన్‌ను అనుకరిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇద్దరూ వైట్ షర్ట్, ఖాకీ కలర్ ప్యాంట్ ధరించి ఉన్న ఫోటోలను పక
జగన్‌ను ఫాలో అవుతున్న దళపతి విజయ్.. నెట్టింట చర్చ


అమరావతి, 4 అక్టోబర్ (హి.స.) తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్ డ్రెస్సింగ్ స్టైల్ విషయంలో ఏపీ మాజీ సీఎం జగన్‌ను అనుకరిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇద్దరూ వైట్ షర్ట్, ఖాకీ కలర్ ప్యాంట్ ధరించి ఉన్న ఫోటోలను పక్కపక్కన పెట్టి వైరల్ చేస్తున్నారు. దీంతో వైసీపీ అభిమానులు, కార్యకర్తలు విజయ్ జగన్‌ను ఫాలో అవుతున్నారు అంటూ పోస్టులు పెడుతుండగా, కూటమి పార్టీల సోషల్ మీడియా వారికి కౌంటర్ ఇస్తోంది. ఎవరిని ఫోలో అవ్వాలో తెలుసుకోవడం ముఖ్యం, తమిళనాడులో ఎవరూ దొరకలేదా.. మహానుభావులు ఉన్నారుగా అంటూ పోస్టులు పెడుతున్నారు.

దీంతో విజయ్ స్టైల్ పై నెట్టింట చర్చ మొదలైంది. అయితే గతంలో ప్రశాంత్ కిషోర్ జగన్‌కు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించగా తరవాత విజయ్‌కి కూడా వ్యూహకర్తగా వ్యవహరించాడు. దీంతో ఇదంతా ప్రశాంత్ కిషోర్ అడుగుజాడల్లో నడవటం వల్లే అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే జగన్ తన తండ్రి వైఎస్ఆర్ వారసుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వగా విజయ్ సినిమాల ద్వారా పరిచమయమై తరవాత పార్టీని స్థాపించారు. ఏపీ రాజకీయాల్లో జగన్ ప్రతిపక్షంలో ఉండగా, విజయ్ ఇప్పుడిప్పుడే పార్టీని బలోపేతం చేస్తున్నారు. ఒకే స్టైల్ ఫాలో అవుతున్న వీరిద్దరి పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande