యాదాద్రి లక్ష్మీనరసింహుని దర్శించుకున్న రాష్ట్ర డీజీపీ
యాదగిరిగుట్ట, 5 అక్టోబర్ (హి.స.) తెలంగాణ రాష్ట్ర డీజీపీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన బి.శివధర్ రెడ్డి కుటుంబ సమేతంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామివారిని ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వాగతం
రాష్ట్ర డీజీపీ


యాదగిరిగుట్ట, 5 అక్టోబర్ (హి.స.)

తెలంగాణ రాష్ట్ర డీజీపీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన బి.శివధర్ రెడ్డి కుటుంబ సమేతంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామివారిని ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం వేద పండితులు ఆయనకు వేదశ్వీరచనం అందజేశారు. అనంతరం స్వామి వారి చిత్రపటం, లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, పోలీస్ అధికారులు, ఆలయ అధికారులు ఉన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande