వేములవాడ ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ.. ప్రత్యేక బస్సుల ఏర్పాటు
తెలంగాణ, రాజన్న సిరిసిల్ల. 5 అక్టోబర్ (హి.స.) రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని టీజీఎస్ ఆర్టీసీ ప్రధాన బస్టాండ్ లో ప్రయాణికుల రద్దీ నెలకొంది. బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా వేములవాడ పాటు పరిసర గ్రామాలకు తరలివచ్చిన ప్రయాణికులు ఆదివారం తిరు
వేములవాడ


తెలంగాణ, రాజన్న సిరిసిల్ల. 5 అక్టోబర్ (హి.స.)

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని టీజీఎస్ ఆర్టీసీ ప్రధాన బస్టాండ్ లో ప్రయాణికుల రద్దీ నెలకొంది. బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా వేములవాడ పాటు పరిసర గ్రామాలకు తరలివచ్చిన ప్రయాణికులు ఆదివారం తిరుగు ప్రయాణం అవుతున్నారు. ఈ క్రమంలో బస్టాండ్ మొత్తం ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ముఖ్యంగా హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, కామారెడ్డి, జగిత్యాల, సిద్దిపేట వైపు వెళ్లే ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉంది.

ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్న మార్గాల్లో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారి వారి గమ్యస్థానాలకు చేర్చేలా చర్యలు తీసుకుంటున్నామని డిపో మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande