విశాఖపట్నం, 5 అక్టోబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం )పై వాయుగుండం ప్రభావం()కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే మూడు గంటల్లో పలు జిల్లాలకు భారీ వర్ష )సూచన ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కడప, అనంతపురంలో వర్షం పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఈ క్రమంలో ఏపీలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్, మరికొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ