జూబ్లీహిల్స్ బైపోల్.. ఆ ముగ్గురి పేర్లను షార్ట్ లిస్ట్ చేసిన ఇన్చార్జ్ మంత్రులు
హైదరాబాద్, 5 అక్టోబర్ (హి.స.) బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణం కారణంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనివార్యం అయింది. ఈ ఉపఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ అతి త్వరలో విడుదల కానుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. కాగా జూబ
జూబ్లీహిల్స్


హైదరాబాద్, 5 అక్టోబర్ (హి.స.)

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణం కారణంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనివార్యం అయింది. ఈ ఉపఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ అతి త్వరలో విడుదల కానుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. కాగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థిని అధికారికంగా ప్రకటించింది. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా చేసుకొని ముందుకు సాగుతోంది.

ఈ క్రమంలోనే ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎంపికకు సంబంధించి ఇన్చార్జ్ మంత్రులను నియమించింది. వారు పోటీలో నిలవాలని బావిస్తున్న అభ్యర్థుల పేర్లను తీసుకొని రాజకీయ సమీకరణాల్లో భాగంగా.. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ ఇంచార్జి మంత్రులు కసరత్తు చేశారు. అనంతరం.. మొత్తం అభ్యర్థులలో గెలుపు గుర్రాలు భావిస్తూ.. నవీన్ యాదవ్, బొంతురామ్మోహన్, CN రెడ్డి పేర్లను షార్ట్ లిస్ట్ చేశారు

వీరి పేర్లను మంత్రులు టీపీసీసీ చీఫ్ కు పంపగా ఆయన స్క్రీనింగ్ కమిటీకి పంపనున్నట్లు తెలుస్తుంది. అతి త్వరలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అభ్యర్థి ఎవరనే విషయాన్ని కాంగ్రెస్ హైకమాండ్ ఫైనల్ చేయనుంది. ఇదిలా ఉంటే మొదటి నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీలో తానే ఉండబోతున్నట్లు ప్రచారం చేసుకున్న మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ పేరు షార్ట్ లిస్టులో లేకపోవడం ఆయనకు షాక్ ఇచ్చినట్లైంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande