స్థానిక సంస్థల ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్స్
హైదరాబాద్, 5 అక్టోబర్ (హి.స.) రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్స్ నియామకాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసింది. గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలకు 20 మంది స్టార్ క్యాంపెయినర్స్ను, గుర్తింపు లేని రిజిస్టర్
ఎలక్షన్స్


హైదరాబాద్, 5 అక్టోబర్ (హి.స.)

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్స్ నియామకాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసింది. గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలకు 20 మంది స్టార్ క్యాంపెయినర్స్ను, గుర్తింపు లేని రిజిస్టర్ పార్టీలకు ఐదుగురిని నియమించుకోవచ్చని సూచించింది. ఈ మేరకు శనివారం మార్గదర్శకాలు విడుదల చేసింది. స్టార్ క్యాంపెయినర్లకు వాహనాలకు అనుమతి ఇచ్చే అధికారాన్ని పంచాయతీరాజ్ కమిషనర్కు ఇచ్చింది. జాతీయ, ప్రాంతీయ పార్టీలతోపాటు 71 రిజిస్టర్ పార్టీలకు కూడా వాహనాలను పంచాయతీరాజ్ కమిషనర్ ఇవ్వనున్నారు. స్టార్ క్యాంపెయినర్ల పేర్లను ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన ఐదు రోజుల్లో ఇవ్వాలని ఎస్ఈసీ సూచించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande