తెలంగాణ, మొయినాబాద్. 5 అక్టోబర్ (హి.స.)
దీక్ష సహనానికి ప్రతి రూపం శ్రీ శ్రీ శ్రీ సగర భగీరథ మహర్షి అని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. ఆదివారం నాడు మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని పెద్దమంగళారం గ్రామంలో ఉప్పర సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ శ్రీ శ్రీ సగర భగీరథ మహర్షి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని విగ్రహ ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భగీరథ మహర్షి మహాజ్ఞానిగా అభివర్ణించారని, పరోపకారానికి పెట్టిన పేరు దీక్ష, సహనానికి ప్రతిరూపం అని తెలిపారు. భగీరథ మహర్షి ఎంత కష్టమైన లెక్క చేయకుండా అనుకున్నవి సాధించాడని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు