హైదరాబాద్, 5 అక్టోబర్ (హి.స.)
యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని రవాణా, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్, కేబీఆర్ పార్క్ వద్ద జరిగిన 'స్టాప్ సబ్స్టెన్స్ అబ్యూస్' రన్ ను మంత్రి పొన్నం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతలో మాదకద్రవ్యాల వినియోగం పెరుగుతుందన్నారు. ఇది అతిపెద్ద ముప్పు అన్నారు. ఇది వారి ప్రతిభను నాశనం చేస్తుందన్నారు. విద్యను దెబ్బతీస్తుందని చెప్పారు. ఉజ్వల భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. ప్రతి యువకుడు తాను మాత్రమే కాకుండా, తన చుట్టూ ఉన్న వారిని కూడా ఈ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంచేందుకు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..