ఔటర్ రింగ్ రోడ్డుపై వరుసగా ఆరు కార్లు ఢీ.. ట్రాఫిక్ జామ్
హైదరాబాద్, 5 అక్టోబర్ (హి.స.) ఔటర్ రింగ్ రోడ్డుపై వరుసగా ఆరు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఈ ఘటన జరిగింది. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తుండగా ఎస్ క్రాస్ కారు డ్రై
Orr


హైదరాబాద్, 5 అక్టోబర్ (హి.స.)

ఔటర్ రింగ్ రోడ్డుపై వరుసగా ఆరు

కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఈ ఘటన జరిగింది. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తుండగా ఎస్ క్రాస్ కారు డ్రైవర్ హిమాయత్ సాగర్ వద్ద సడన్గా బ్రేక్ వేశాడు. దీంతో వరుసగా ఆరు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఔటర్ రింగ్ రోడ్డుపై రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ ప్రమాదంలో ఆరు కార్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కారులోని బెలూన్స్ ఓపెన్ కావడంతో ప్రమాదం తప్పింది. కార్లు ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరికీ స్వల్ప గాయాలు అయ్యాయి. ఔటర్ పై ఏర్పడిన ట్రాఫిక్ను రాజేంద్రనగర్ లాండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు క్లియర్ చేశారు. ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నామని, కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande