రాజన్న సిరిసిల్ల, 5 అక్టోబర్ (హి.స.)
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి కాంగ్రెస్
పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని కార్యకర్తలకు నాయకులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. ఎంపిపి, జడ్పీటీసీ రిజర్వేషన్లు ఎస్టీలకు వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉమ్మడి మానాల నుంచి అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు. గతంలో ఎన్నికలు జరిగినప్పుడు ఉమ్మడి మానాల ప్రజలు నాయకులు కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని గుర్తుచేశారు. సెలెక్టెడ్ ఎలెక్టెడ్ పద్దతిలో అభ్యర్థి ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు