కాలుష్య నియంత్రణకు తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం
హైదరాబాద్, 5 అక్టోబర్ (హి.స.) హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెడుతూనే.. కాలుష్యరహిత ప్రజా రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బస్సులను పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ వినియోగించాలని టీజీఎస్ ఆర్టీసీని ఆ
తెలంగాణ ఆర్టీసీ


హైదరాబాద్, 5 అక్టోబర్ (హి.స.)

హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెడుతూనే.. కాలుష్యరహిత ప్రజా రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బస్సులను పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ వినియోగించాలని టీజీఎస్ ఆర్టీసీని ఆదేశించింది. ఓఆర్ఆర్ లోపల 2027 నాటికి 2,800 డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశ పెట్టాలని నిర్దేశించింది. దీంతో ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చుకునేందుకు యాజమాన్యం ఇప్పటికే చర్యలు చేపట్టింది. రెండేళ్లలో దశల వారీగా ఎలక్ట్రిక్ బస్సులను వాడకంలోకి తెచ్చేలా ప్రణాళిక రూపొందించింది. ఎలక్ట్రిక్ బస్సులకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను సైతం ఏర్పాటు చేసుకుంటున్నది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ లో 25 డిపోలున్నాయి. అందులో ఆరు డిపోల పరిధిలో 265 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తుండగా... ఈ ఏడాదిలో మరో 275 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande