కడప జిల్లాలోని ప్రొద్దుటూరు శ్రీ రామ.నగర లో దారుణం చోటుచేసుకుంది
కడప, 5 అక్టోబర్ (హి.స.) , :కడప జిల్లాలోనిప్రొద్దుటూరు శ్రీరామ్ నగర్‌లో దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది. కన్నతల్లి లక్ష్మీదేవిని కొడుకు యశ్వంత్ రెడ్డి హత్య చేశాడు. యశ్వంత్ రెడ్డికి కొన్నేళ్లుగా మానసిక స్థితి సరిగా లేదు. ఈ క్రమంలో తనను తల్లి తిట్టిందని
కడప జిల్లాలోని ప్రొద్దుటూరు శ్రీ రామ.నగర లో దారుణం చోటుచేసుకుంది


కడప, 5 అక్టోబర్ (హి.స.)

, :కడప జిల్లాలోనిప్రొద్దుటూరు శ్రీరామ్ నగర్‌లో దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది. కన్నతల్లి లక్ష్మీదేవిని కొడుకు యశ్వంత్ రెడ్డి హత్య చేశాడు. యశ్వంత్ రెడ్డికి కొన్నేళ్లుగా మానసిక స్థితి సరిగా లేదు. ఈ క్రమంలో తనను తల్లి తిట్టిందని కూరగాయల కత్తితో గొంతుకోసి యశ్వంత్ రెడ్డి హత్యచేశాడు. వంటింట్లో లక్ష్మీదేవి ఉండగా ఆమెతో గొడవ పడ్డాడు యశ్వంత్ రెడ్డి. కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసి హత్య చేశాడు. వంటింట్లో రక్తపు మడుగులో పడి ఉన్న తల్లిని అలాగే ఈడ్చుకుంటూ ఇంటి బయట పడేశాడు యశ్వంత్ రెడ్డి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande