మూసీ నదికి భారీ వరద.. జూలూరు - రుద్రెల్లి రాకపోకలు బంద్
యాదాద్రి భువనగిరి, 5 అక్టోబర్ (హి.స.) ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా వరద నీరు ఉధృతంగా రావడంతో ఆదివారం మూసినది ఉప్పొంగింది. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని జూలూరు - రుద్రెల్లి గ్రామాల మధ్య గల బ్రిడ్
మూసీ నది


యాదాద్రి భువనగిరి, 5 అక్టోబర్ (హి.స.)

ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా వరద నీరు ఉధృతంగా రావడంతో ఆదివారం మూసినది ఉప్పొంగింది. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని జూలూరు - రుద్రెల్లి గ్రామాల మధ్య గల బ్రిడ్జి మీద నీరు ప్రవహించడంతో ఇరు గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే పోచంపల్లి నుండి బీబీనగర్ వెళ్లేందుకు ఇదే ప్రధాన రహదారి.

ఈ బ్రిడ్జి పై మూసి నీరు పారుతుండడంతో బీబీనగర్, భువనగిరి వెళ్లాలంటే పెద్దరావులపల్లి, బట్టుగూడెం మీదుగా సుమారు 20 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్రిడ్జి వద్దకు పోలీసులు చేరుకుని బారికేడ్లను ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు. మూసీ పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గొర్రెలు, పశువుల కాపరులు మూసీ నది వైపు వెళ్ళద్దని హెచ్చరికలు జారీ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande