ఢిల్లీ, 6 అక్టోబర్ (హి.స.)ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం అయిన ఎవరెస్ట్ (Mount Everest) పై ఉహించిన పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా.. టిబెట్ వైపు ఉన్న ఎవరెస్ట్ తూర్పు భాగంలో సంభవించిన తీవ్ర మంచు తుఫాను (snow storm) వచ్చింది. దీంతో సుమారు 1,000 మంది పర్వతారోహకులు (1,000 mountaineers) ఆ తుఫానులో చిక్కుకున్నట్లు తెలుస్తుంది.వారిలో భారతీయులు, చైనీయులు, అమెరికన్లు, ఇతర దేశాలకు చెందిన ట్రెక్కర్లు ఉన్నట్లు సమాచారం. మౌంట్ ఎవరెస్ట్ (Mount Everest) ప్రాంతంలో ఆకస్మికంగా వచ్చిన మంచు తుఫాను కారణంగా దారులు పూర్తిగా మంచుతో కప్పుకుపోవడంతో రక్షణ చర్యలు తీవ్రంగా ఇబ్బందులు ఎదురవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం నుంచి చైనా అధికారులు ఇప్పటి వరకు సుమారు 350 మందిని రక్షించినట్లు వెల్లడించారు.
ఇంకా వందలాది మంది పర్వతారోహకులతో సంబంధం పూర్తిగా తెగిపోయినట్లు రక్షణ బృందాలు తెలిపాయి. మంచు తుఫానుతో ఉష్ణోగ్రతలు మైనస్ స్థాయికి పడిపోవడంతో హైపోథర్మియా ప్రమాదం పెరిగిందని వైద్య నిపుణులు హెచ్చరించారు. ప్రస్తుతం రక్షణ చర్యలు హెలికాప్టర్లు, ట్రెక్కింగ్ బృందాల సహాయంతో కొనసాగుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV