ఆమెకు నోటీసులు ఎందుకు ఇవ్వలేదు: సోనమ్ వాంగ్‌చుక్ అరెస్టుపై సుప్రీంకోర్టు
లద్దాఖ్‌ /ఢిల్లీ, 06 అక్టోబర్ (హి.స.) : ఉద్యమ నేత సోనమ్‌ వాంగ్‌చుక్‌కు సుప్రీంకోర్టు(Sonam Wangchuk detention)లో ఊరట లభించలేదు. జాతీయ భద్రతా చట్టం (NSA) కింద వాంగ్‌చుక్‌ను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన భార్య గీతాంజలి జె.అంగ్మో వేసిన పిటిషన్‌
బాంబే హైకోర్టు


లద్దాఖ్‌ /ఢిల్లీ, 06 అక్టోబర్ (హి.స.)

: ఉద్యమ నేత సోనమ్‌ వాంగ్‌చుక్‌కు సుప్రీంకోర్టు(Sonam Wangchuk detention)లో ఊరట లభించలేదు. జాతీయ భద్రతా చట్టం (NSA) కింద వాంగ్‌చుక్‌ను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన భార్య గీతాంజలి జె.అంగ్మో వేసిన పిటిషన్‌ విచారణను సోమవారం న్యాయస్థానం వాయిదా వేసింది. వచ్చే మంగళవారం దానిని విచారించనుంది. అలాగే కేంద్రం, జమ్మూకశ్మీర్ యంత్రాంగానికి, రాజస్థాన్‌ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తన భర్తను ఎన్‌ఎస్‌ఏ చట్టం కింద నిర్బంధించడానికి గల కారణాలపై ఆమెకు ముందస్తు నోటీసులు ఎందుకు ఇవ్వలేదని కేంద్రాన్ని కోర్టు ప్రశ్నించింది.

వాంగ్‌చుక్‌ను జాతీయ భద్రత చట్టం(ఎన్‌ఎస్‌ఏ) కింద అరెస్టు చేయడం అన్యాయమని పేర్కొన్న ఆయన భార్య గీతాంజలి.. ఆయన్ను తక్షణమే విడుదల చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ సుప్రీంకోర్టు (Sonam Wangchuk)లో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ లేకుండానే రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌ జైలులో నిర్బంధించిన తన భర్తను సర్వోన్నత న్యాయస్థానం ఎదుట హాజరుపరచాలని ఆమె కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande