నేడే బిహార్‌ ఎన్నికల షెడ్యూల్‌.. సాయంత్రం 4 గంటలకు ఈసీ ప్రెస్‌మీట్‌
ఢిల్లీ, 06 అక్టోబర్ (హి.స.)బిహార్‌ శాసనసభ ఎన్నికలకు నగారా మోగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం నేడు షెడ్యూల్‌ ఖరారు చేయనుంది. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఈసీ (Election Commission) ప్రెస్‌మీట్‌ నిర్వహించి ఎన్నికల తేదీలను వెల్లడించనుంది. ఈమేరకు ఈసీ అధికారిక ప్ర
kerala-local-body-election-voter-list


ఢిల్లీ, 06 అక్టోబర్ (హి.స.)బిహార్‌ శాసనసభ ఎన్నికలకు నగారా మోగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం నేడు షెడ్యూల్‌ ఖరారు చేయనుంది. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఈసీ (Election Commission) ప్రెస్‌మీట్‌ నిర్వహించి ఎన్నికల తేదీలను వెల్లడించనుంది. ఈమేరకు ఈసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

బిహార్‌ (Bihar)లో మొత్తం 243 శాసనసభ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుత అసెంబ్లీ గడువు వచ్చేనెల చివరివారంతో ముగియనుంది. నవంబరు 22వ తేదీకి ముందే పోలింగ్ నిర్వహిస్తామని ఇప్పటికే కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్‌కుమార్‌ వెల్లడించారు. మొత్తం మూడు విడతల్లో ఎన్నికల పోలింగ్‌ (Bihar Polls) జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతను సమీక్షించేందుకు ఇప్పటికే సీఈసీ బృందం రెండు రోజులు బిహార్‌లో పర్యటించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande