జైపూర్, 6 అక్టోబర్ (హి.స.)రాజస్థాన్‌లో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రి ఐసీయూలో అగ్ని ప్రమాదం జరగటంతో 6 మంది పేషంట్లు చనిపోయారు. మరో 5 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఆదివారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. జైపూర్‌లోని సవాయ్ మన్ సింగ్ (ఎస్ఎమ్ఎస్) ఆస్పత్రిలో ఆదివారం రాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా సెకండ్ ఫ్లోర్‌లోని ట్రోమా ఐసీయూలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
దీంతో విషపూరితమైన వాయువులు విడుదల అయ్యాయి. ప్రమాదం జరిగినపుడు ఐసీయూలో 24 మంది పేషంట్లు ఉన్నారు. వారిలో 11 మంది ట్రోమా ఐసీయూలో, మరో 13 మంది అడ్జసెంట్ ఐసీయూలో ఉన్నారు. ప్రమాదాన్ని గుర్తించిన ఆస్పత్రి సిబ్బంది వెంటనే అప్రమత్తం అయ్యారు. హుటాహుటిన పేషంట్లను అక్కడినుంచి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, విషవాయువుల కారణంగా 6 మంది చనిపోయారు. మరో 5 మంది పరిస్థితి విషమంగా ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV