కర్నూలు, 6 అక్టోబర్ (హి.స.)
శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే అనేక ఆహారాలను మినహాయించాల్సి ఉంటుంది. క్రమం తప్పకుండా మందులు తీసుకోవడంతోపాటు రోజుకు ఓ జామపండు తినాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. వీటిని తినడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుందని పోషకాహార నిపుణులు సైతం అంటున్నారు. జామపండు తినడం వల్ల శరీరానికి కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
జామ ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గిస్తుంది. జామలో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో పేరుకుపోయిన అదనపు చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్ (HDL) పెంచుతుంది.
రోజూ ఒక జామపండు తినడం వల్ల శరీరంలో ప్రయోజనకరమైన మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జామ క్రమం తప్పకుండా తినడం వల్ల రక్త నాళాలు మూసుకుపోకుండా నిరోధించి గుండె జబ్బుల అవకాశాలను తగ్గిస్తుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV