నేడే బిహార్‌ ఎన్నికల షెడ్యూల్‌.. సాయంత్రం ఈసీ కీలక ప్రెస్‌మీట్
ఢిల్లీ, 6 అక్టోబర్ (హి.స.)ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. ఈ మేరకు భారత ఎన్నికల సంఘం (ECI) ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనుంది. ముఖ్య ఎన్నికల కమిషనర్ గ్యానేష్ కుమార్‌తో పాటు ఎన్నికల కమిషన
నేడే బిహార్‌ ఎన్నికల షెడ్యూల్‌.. సాయంత్రం ఈసీ కీలక ప్రెస్‌మీట్


ఢిల్లీ, 6 అక్టోబర్ (హి.స.)ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. ఈ మేరకు భారత ఎన్నికల సంఘం (ECI) ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనుంది.

ముఖ్య ఎన్నికల కమిషనర్ గ్యానేష్ కుమార్‌తో పాటు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి పట్నా పర్యటించి అక్కడి రాష్ట్ర అధికారులతో భద్రతా ఏర్పాట్లు, లాజిస్టిక్స్, ఎన్నికల సన్నద్ధతలపై సమగ్రంగా చర్చించారు. ఈ క్రమంలోనే ఇవాళ బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించబోతోంది. కాగా, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) తర్వాత సెప్టెంబర్ 30, 2025న చివరి ఎన్నికల ఓటరు జాబితాను అధికారులు ఇప్పటికే విడుదల చేశారు. సమారు 22 సంవత్సరాల తర్వాత జరిగిన ఓటరు జాబితా సవరణలో సుమారు 47 లక్షల ఓటర్లను తొలగించారు. ఓటర్లు భారత ఎన్నికల సంఘం వెబ్‌సైట్ లేదా ఓటర్ హెల్ప్‌లైన్ యాప్‌లో తమ వివరాలు తనిఖీ చేసుకోవచ్చని అధికారులు ప్రకటించారు. ఇదే ప్రెస్‌మీట్‌లో జూబ్లీ‌హిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande