బెంగళూరు, 8 అక్టోబర్ (హి.స.)
మనుస్మృతి, సనాతన ధర్మం పేరుతో దాడులు సరికాదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అన్నారు. సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ బీఆర్. గవాయ్పై దాడికి యత్నించడానికి ఖర్గే ఖండించారు. ఇటీవల అస్వస్థతకు గురై ఖర్గే కోలుకున్నారు. బుధవారం బెంగళూరులో ఖర్గే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా గవాయ్పై దాడి ఘటనను తీవ్రంగా తప్పుపట్టారు. సుప్రీంకోర్టులో సీజేఐపై దాడికి యత్నించిన వ్యక్తులను న్యాయవాదులు, బార్ అసోసియేషన్ ఖండించాలన్నారు. మనుస్మృతి, సనాతన ధర్మం పేరుతో దాడులకు పాల్పడే వారిని విద్యావంతులను చేయాలని కోరారు. సమాజంలో అనవసరమైన ఉద్రిక్తతను వ్యాప్తి చేయడానికి, శాంతికి భంగం కలిగించడానికి ప్రయత్నించే వారిని విద్యావంతులను చేసి జవాబుదారీగా ఉంచాలని తెలిపారు. ---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు