రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో 1.14 లక్షల కోట్లు .ఆమోదం
అమరావతి, 8 అక్టోబర్ (హి.స.) 11వరాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశంలో రూ. 1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోద ముద్ర పడింది. ఈరోజు (బుధవారం) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు పాల్గొన్నా
రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో 1.14  లక్షల కోట్లు .ఆమోదం


అమరావతి, 8 అక్టోబర్ (హి.స.)

11వరాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశంలో రూ. 1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోద ముద్ర పడింది. ఈరోజు (బుధవారం) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు పాల్గొన్నారు. మూడు 3 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఎస్‌ఐపీబీ సమావేశంలో ప్రాజెక్టుల వారీగా లోతైన చర్చ జరిగింది. భారీ ప్రాజెక్టులకు ప్రత్యేక అధికారుల నియామకానికి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కంపెనీలు త్వరగా గ్రౌండ్ అయ్యేలా ప్రత్యేక అధికారులు బాధ్యత తీసుకోనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande