ఉండ్రాజపురం లో ఇంటర్.ద్వితీయ సంవత్సరం విద్యార్దిని ఆత్మహత్య
అమరావతి, 8 అక్టోబర్ (హి.స.) ఆ విద్యార్థినికి ఏం కష్టమొచ్చిందో తెలియదు. అప్పటివరకు కళాశాలలో తరగతులకు హాజరై తిరుగు ప్రయాణంలో ఇంటికి బస్సులో వస్తుండగా మధ్యలో ఆపించి అందరూ చూస్తుండగానే కాలువలోకి దూకేసింది. ఉండ్రాజవరం మండలం దమ్మెన్ను వంతెన వద్ద మంగళవా
ఉండ్రాజపురం లో  ఇంటర్.ద్వితీయ సంవత్సరం విద్యార్దిని ఆత్మహత్య


అమరావతి, 8 అక్టోబర్ (హి.స.)

ఆ విద్యార్థినికి ఏం కష్టమొచ్చిందో తెలియదు. అప్పటివరకు కళాశాలలో తరగతులకు హాజరై తిరుగు ప్రయాణంలో ఇంటికి బస్సులో వస్తుండగా మధ్యలో ఆపించి అందరూ చూస్తుండగానే కాలువలోకి దూకేసింది. ఉండ్రాజవరం మండలం దమ్మెన్ను వంతెన వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

మోర్త గ్రామానికి చెందిన కప్పుల పూజిత వేలివెన్ను ప్రాంతంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తోటి విద్యార్థులతో కలిసి సాయంత్రం కళాశాల బస్సులో ఇంటికి బయలుదేరింది. దమ్మెన్ను వంతెన వద్దకు రాగానే తనకు వాంతులు వస్తున్నాయని, బస్సు ఆపమని కిందకు దిగింది. వెంటనే అక్కడున్న ప్రధాన కాలువలోకి దూకింది. దీంతో బస్సు చోదకుడు, సహచర విద్యార్థులు ఆందోళనకు గురై పెద్దగా అరవడంతో పరిసరాల్లోని వారు స్పందించి కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో విద్యార్థిని ఆచూకీ లభించలేదు. పోలీసులు, రెవెన్యూ అధికారులు చేరుకున్నారు. తల్లి సుబ్బలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande