అమరావతి, 8 అక్టోబర్ (హి.స.):బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి మన్నార్ గల్ఫ్ వరకు.. తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు ప్రాంతాల మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్లు ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ