అమరావతి, 8 అక్టోబర్ (హి.స.)
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. తమిళులు అత్యంత పెరటాశి మాసాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. తమ స్వగ్రామాల నుంచే తిరుమలకు కాలినడకన చేరుకుని స్వామిని దర్శించుకునే సంప్రదాయం ఉంది. సెప్టెంబరు 17వ తేదీన పెరటాశి మాసం ప్రారంభమైనప్పటికీ 25వ తేదీ వరకు భక్తుల రద్దీ మోస్తరుగానే కనిపించింది. బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన 24వ తేదీతో పాటు 25 తేదీలు వీఐపీల హడావుడితో కనిపించిన క్షేత్రం.. 26 నుంచి మాత్రం భక్తులతో రద్దీగా మారిపోయింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ