ఫోన్ టాపింగ్ కేస్.. సుప్రీంకోర్టులో విచారణ వాయిదా
హైదరాబాద్, 8 అక్టోబర్ (హి.స.) ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా ఫొరెన్సిక్ నివేదికలో కీలకమైన ఆధారాలు లభించాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం
ఫోన్ టాపింగ్ కేస్


హైదరాబాద్, 8 అక్టోబర్ (హి.స.)

ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా

ఫొరెన్సిక్ నివేదికలో కీలకమైన ఆధారాలు లభించాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై ఇవాళ జస్టిసి బీవీ నాగరత్న, జస్టిస్ మహదేవన్ ధర్మాసనం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా ఎఫ్ఎస్ఎల్ (FSL report) నివేదిక అందిందని అందులో డిజిటల్ ఫోరెన్సిక్ ప్లాట్ ఫామ్ నుంచి కీలక ఆధారాలు లభించాయని కోర్టుకు తెలిపారు. ఈ వాదనల అనంతరం తదుపరి విచారణను ధర్మాసనం అక్టోబర్ 14కు వాయిదా వేసింది. కాగా గత విచారణలో సందర్భంలో ప్రభాకర్ రావు దర్యాప్తునకు సహకరించడం లేదని ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దాంతో దర్యాప్తుకు సహకరించాలని ప్రభాకర్ రావును కోర్టు ఆదేశించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande