అమరావతి, 8 అక్టోబర్ (హి.స.)
విశాఖపట్నం, అక్టోబర్ 8: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించిన పోలీసులు ఇచ్చిన కొత్త రూట్‌ను తాము అంగీకరిస్తున్నామని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ పర్యటనకు అనుమతి ఇస్తూనే 18 కండిషన్లు పెట్టారన్నారు. పోలీసులు ఇన్ని నిబంధనలు పెట్టడం సమంజసం కాదని... పునఃసమీక్షించుకోవాలని కోరుతున్నామని మాజీ మంత్రి తెలిపారు. రేపు (గురువారం) జగన్ పర్యటన ఎయిర్ పోర్టు నుంచి ఎన్ఏడి కొత్త రోడ్డు, గోపాలపట్నం, వేపగుంట, అనకాపల్లి మీదగా ప్రయాణిస్తారని... నర్సీపట్నం మెడికల్ కళాశాలకు వెళ్తారని వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ