
ఉండవల్లి, 1 నవంబర్ (హి.స.), : ‘మొంథా’ తుపాను (Cyclone Montha) వేళ అధికారులు సహాయక చర్యల్లో అద్భుతంగా పని చేశారని, వారందరికీ ప్రత్యేక అభినందనలు అని సీఎం చంద్రబాబు (CM Chandrababu) ప్రశంసించారు. ఇవాళ ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ముందు జాగ్రత్త చర్యలతో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించగలిగామని అన్నారు. తుపాను కూడా లెక్క చేయకుండా అధికారులు పని చేశారని పేర్కొన్నారు. ముఖ్యంగా యువ ఐఏఎస్ (IAS) అధికారుల టీమ్‌తో తుపానును సమర్థవంతంగా ఎదుర్కొన్నామని అన్నారు. సైక్లోన్ అలర్ట్ వచ్చిన నాటి నుంచే ట్రాకింగ్ మొదలుపెట్టామని తెలిపారు.
అవేర్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు ఫ్లడ్ మేనేజ్‌మెంట్ చేశామని సీఎం చంద్రబాబు అన్నారు. అతిపెద్ద తుపాను వచ్చినా ఇద్దరు మాత్రమే దురదృష్టవశాత్తు మృతి చెందారని పేర్కొన్నారు. తుపాను మొదట కాకినాడ (Kakinada) దగ్గర తీరం దాటుందని అనుకున్నామని.. కానీ, కావలిలో భారీ వర్షం కురిసిందని తెలిపారు. ఆ తర్వాత సైక్లోన్ తెలంగాణ (Telangana) వైపు వెళ్లడంతో అక్కడి భారీ వర్షాలు కురిశాయని వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV