
హైదరాబాద్, 12 నవంబర్ (హి.స.)
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై
మధురానగర్ పోలీస్ స్టేషన్ లో బుధవారం న్యూసెన్స్ కేసు నమోదయింది.నిన్న జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక క్రమంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎన్నికల నిబంధనలు పాటించలేదని పోలీసులు కేసు నమోదు చేశారు. యూసఫ్ గూడ పోలింగ్ కేంద్రాల వద్ద కౌశిక్ రెడ్డి హల్ చల్ చేశారని, తన అనుచరులతో మహమూద్ ఫంక్షన్ హాల్లోకి చొచ్చుకువెళ్లారని పోలీసులు వెల్లడించారు. పోలీసులను లెక్క చేయకుండా నెట్టుకుని వెళ్లడం, పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారన్నారు. కౌశిక్ రెడ్డిపై ట్రేస్ పాసుతో పాటు న్యూసెన్స్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు