భారత మహిళల జట్టు విశ్వ విజేతగా నిలిచిన శ్రీ చరణిని బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర.జోనల్ మేనేజర్ సత్కరించారు
అమరావతి, 12 నవంబర్ (హి.స.) ఎర్రగుంట్ల: భారత మహిళల జట్టు విశ్వవిజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన బౌలర్‌ శ్రీచరణిని బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (బీవోఎం) తరఫున జోనల్ మేనేజర్ ఎ. వైద్యనాథ్ సత్కరించారు. బుధవారం కడప జిల్లాలోని ఆమె నివాసంలో కలుసుకున్న వైద్
భారత మహిళల జట్టు విశ్వ విజేతగా నిలిచిన శ్రీ చరణిని బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర.జోనల్ మేనేజర్ సత్కరించారు


అమరావతి, 12 నవంబర్ (హి.స.)

ఎర్రగుంట్ల: భారత మహిళల జట్టు విశ్వవిజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన బౌలర్‌ శ్రీచరణిని బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (బీవోఎం) తరఫున జోనల్ మేనేజర్ ఎ. వైద్యనాథ్ సత్కరించారు. బుధవారం కడప జిల్లాలోని ఆమె నివాసంలో కలుసుకున్న వైద్యనాథ్‌.. ఆమెకు జ్ఞాపికను అందించి సత్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘శ్రీచరణి సాధించిన విజయానికి మేం ఎంతో గర్విస్తున్నాం. ఆమె అంకితభావం, కష్టానికి ప్రతిఫలంగా దేశానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి అపారమైన కీర్తిని తెచ్చిపెట్టింది’’ అని వైద్యనాథ్ పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande