
నల్గొండ, 12 నవంబర్ (హి.స.)
'జాగృతి జనం బాట'లో భాగంగా నల్లగొండ జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలో తన ఫ్లెక్సీలను తొలగించడంపై ఆమె స్పందించారు. ఫ్లెక్సీలు తొలగించడానికి కవిత తప్పు పట్టారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పెద్ద మంత్రి అనుకున్నా అని విమర్శించారు. ప్రజా సమస్యలు ప్రస్తావిస్తే.. ఫ్లెక్సీలు తొలగిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను తాను ప్రస్తావిస్తున్నా అని, చేతనైతే ప్రభుత్వం సమస్యలను త్వరగా పరిష్కరించాలన్నారు. నల్లగొండకు కల్వకుంట్ల కవిత రానున్న నేపథ్యంలో ఆమె అభిమానులు కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన కటౌట్లు, ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..