జుక్కల్ ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా.. ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు
కామారెడ్డి, 12 నవంబర్ (హి.స.) జుక్కల్ నియోజకవర్గాన్నికామారెడ్డి జిల్లాలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావు అన్నారు. బుధవారం జుక్కల్ మండలంలోని మైబాపూర్ గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న గ్రామ
జుక్కల్ ఎమ్మెల్యే


కామారెడ్డి, 12 నవంబర్ (హి.స.)

జుక్కల్ నియోజకవర్గాన్నికామారెడ్డి జిల్లాలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావు అన్నారు.

బుధవారం జుక్కల్ మండలంలోని మైబాపూర్ గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి, బీజ్జల్ వాడి గ్రామంలో రూ.29 లక్షల వ్యయంతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణానికి వారు

శంకుస్థాపనలు చేశారు. నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా జుక్కల్ ప్రాంతం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande