
హైదరాబాద్, 12 నవంబర్ (హి.స.)
అనర్హత ఎమ్మెల్యేల వేటు అంశంపై ఇవాళ, రేపు జరగాల్సిన విచారణను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అలాగే ఈ విచారణలను ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించనున్నట్లు సమాచారం.. షెడ్యూల్ ప్రకారం ఈ రోజు తెల్లం వెంకట్రావు, సంజయ్ ల పిటిషన్లపై రెండోసారి విచారణ జరగాల్సి ఉంది.
అలాగే రేపు గురువారం 13న పోచారం, అరికెపూడి గాంధీ ను మరోసారి విచారించాల్సి ఉండగా.. వాయిదా వేశారు. ఇదిలా ఉంటే మూడు నెలల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించగా.. స్పీకర్ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కోర్టు ధిక్కరణకు పాల్పడారని ఆరోపిస్తూ.. బీఆర్ఎస్ నేతలు మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. ఆ పిటిషన్ పై విచారణకు కోర్టు అంగీకరించింది. మరో పక్క.. ఎమ్మెల్యేల అనర్హతపై విచారణకు మరికొంత సమయం కావాలని కోరుతూ స్పీకర్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. స్పీకర్ పిటిషన్ పై విచారణకు అంగీకరించి కోర్టు ఈ నెల 14న విచారణను షెడ్యూల్ చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..