వలలతో చేప పిల్లలను వేటాడితే కఠిన చర్యలు : మంత్రి జూపల్లి కృష్ణారావు
నాగర్ కర్నూల్, 12 నవంబర్ (హి.స.) శ్రీశైలం బ్యాక్ వాటర్ కృష్ణా నదిలో వలలతో చేపపిల్లలను వేటాడితే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు హెచ్చరించారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల కృష్ణా న
మంత్రి జూపల్లి


నాగర్ కర్నూల్, 12 నవంబర్ (హి.స.)

శ్రీశైలం బ్యాక్ వాటర్ కృష్ణా నదిలో వలలతో చేపపిల్లలను వేటాడితే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు హెచ్చరించారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల కృష్ణా నదిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మత్స్య శాఖ ద్వారా 100 శాతం రాయితీ పై వివిధ రకాల లక్ష చేప పిల్లలను మత్స్యశాఖ కమిషనర్ నిఖిలతో కలిసి మంత్రి జూపల్లి వదిలారు. ఈ సందర్బంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ అలవి వలలను వినియోగించడం మూలంగా మత్స్యకారులకు ఆదాయం తగ్గుతుందని అన్నారు. చేప పిల్లలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం రాయితీతో అందిస్తున్నామని, మత్స్యకారుల అభివృద్దే లక్ష్యంగా పని చేస్తున్నామని అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande