
నారాయణపేట, 12 నవంబర్ (హి.స.)
నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని సంగంబండ గ్రామంలో బీకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా ఆరోగ్య శిబిరాన్ని మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి పశ్చిమాద్రి సంస్థాన విరక్త మఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ పంచమశిద్ధలింగ మహాస్వామి వారి తో కలిసి బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ.. బీకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా ఆరోగ్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రానున్న రోజుల్లో మూడు, నాలుగు గ్రామాలను కలిపి ఉచిత ఆరోగ్య శిబిరాలను నిర్వహించాలని నిర్ణయించడం అభినందనీయమని అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు