
ఆదిలాబాద్, 12 నవంబర్ (హి.స.)
ఆదిలాబాద్ జిల్లా బేల (Bela) మండలం బాది (Badi) నుండి సిరిసన్న వరకు రహదారి అస్తవ్యస్తంగా మారి దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నామని, పాలకులు అధికారులు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా గ్రామస్తులు తరలివచ్చి బుధవారం జాతీయ రహదారిపై బైఠాయించారు. గత 15 ఏళ్ల క్రితం వేసిన బీటీ రోడ్డు పూర్తిగా కంకర తేలి నడవడానికి నరకయాతన పడుతున్నామని గ్రామస్తులు పేర్కొన్నారు. కనీసం మరమ్మత్తులు కూడా చేపట్టడం లేదని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు.గ్రామస్తుల రాస్తారోకో తో ఇరువైపులా వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు