
ములుగు, 12 నవంబర్ (హి.స.)
2026 సంవత్సరం జనవరి 28 నుండి 31 వరకు జరిగే శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర పురస్కరించుకొని చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించడానికి రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, అట్లూరి లక్ష్మణ్ బుధవారం ఉదయం హైదరాబాదు నుండి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా మేడారం చేరుకున్నారు. వారు నేరుగా సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రుల బృందం పరిశీలించారు. హరిత హోటల్లో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పర్యటనలు మంత్రులతో పాటు ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ , ఎస్పీ డాక్టర్ శబరీష్ పాల్గొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు