విశాఖలోని. షీలా నగర్ కూడలి జాతీయ రహదారి పై కంటైనర్ లారీ బోల్తా
విశాఖ, 12 నవంబర్ (హి.స.): విశాఖలోని షీలానగర్‌ కూడలి వద్ద జాతీయ రహదారిపై కంటైనర్ లారీ బోల్తా పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోర్టు రోడ్డు నుంచి ఎన్ఏడీ వైపు వెళ్తున్న కంటైనర్ లారీ షీలానగర్ కూడలి వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. ఆ సమయంలో వాహనా
విశాఖలోని. షీలా నగర్ కూడలి జాతీయ రహదారి పై కంటైనర్ లారీ బోల్తా


విశాఖ, 12 నవంబర్ (హి.స.): విశాఖలోని షీలానగర్‌ కూడలి వద్ద జాతీయ రహదారిపై కంటైనర్ లారీ బోల్తా పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోర్టు రోడ్డు నుంచి ఎన్ఏడీ వైపు వెళ్తున్న కంటైనర్ లారీ షీలానగర్ కూడలి వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. ఆ సమయంలో వాహనాల రద్దీ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రహదారి మధ్యలో లారీ పడిపోవడంతో షీలానగర్ నుంచి విశాఖ విమానాశ్రయం వరకు ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వందలాది వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ సిబ్బంది నాలుగు క్రేన్‌ల సహాయంతో కంటైనర్‌ను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande