శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ లో.విద్యార్ది ఆత్మహత్యకు పాల్పడ్డాడు
శ్రీకాకుళం, 12 నవంబర్ (హి.స.) ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలో ఇంజినీరింగ్‌ తృతీయ సంవత్సరం చదువుత
శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ లో.విద్యార్ది ఆత్మహత్యకు పాల్పడ్డాడు


శ్రీకాకుళం, 12 నవంబర్ (హి.స.)

ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలో ఇంజినీరింగ్‌ తృతీయ సంవత్సరం చదువుతున్న ప్రత్తిపాటి సృజన్‌(20) అనే విద్యార్థి వసతి గృహంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ట్రిపుల్‌ ఐటీ అధికారులు సృజన్‌ మృతదేహాన్ని శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఎచ్చెర్ల పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande