
హైదరాబాద్, 12 నవంబర్ (హి.స.)
ఈ రోజుల్లో రిగ్గింగ్ చేయడానికి
సాధ్యపడదని.. అలా చేయడానికి పాత జమానా కాదని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఇవాళ గాంధీభవన్లో మీడియా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్కు పాల్పడిందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ఆయన సమాధానం ఇచ్చారు. తెలంగాణలో మరోసారి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. పదేళ్లు కాంగ్రెస్ సర్కారుకు ఎలాంటి డోకా లేదన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమైందని తెలిపారు. ప్రచారంలో మంత్రులతో పాటు ఇంచార్జ్ బాధ్యతలు తీసుకున్న ప్రతీ ఒక్కరూ బాగా పని చేశారని కీతాబిచ్చారు. అయితే, పోలింగ్ పర్సంటెజ్ పెరిగి ఉండాల్సిందని.. పట్టణ ప్రజలు, యువత ముందుకు వచ్చి ఓటు వేయాల్సి ఉండే అంటూ కామెంట్ చేశారు. ఈ రోజుల్లో రిగ్గింగ్ చేయడం పాజిబుల్ కాదని.. ఇదేమీ పాత జమానా కాదని కొట్టిపడేశారు. ఓడిపోతున్నామనే బాధతో బీఆర్ఎస్ వాళ్లు మాట్లాడుతున్నారని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు