
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}
ముంబై,, 13 నవంబర్ (హి.స.)
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో వరుసగా మూడో రోజూ దేశీయ సూచీలు లాభపడ్డాయి. బిహార్ ఎన్నికల్లో అధికార ఎన్‌డీఏ కూటమి విజయం సాధించనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడం సెంటిమెంట్‌ను బలోపేతం చేసింది. ఐటీ, మన్నికైన వినిమయ వస్తువుల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 16 పైసలు తగ్గి 88.66 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 0.84% నష్టంతో 64.61 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో షాంఘై నష్టపోగా, మిగతావి లాభపడ్డాయి. ఐరోపా సూచీలు లాభాల్లో ట్రేడయ్యాయి.
బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ బుధవారం రూ.4.75 లక్షల కోట్లు పెరిగి రూ.473.69 లక్షల కోట్లు (5.34 లక్షల కోట్ల డాలర్లు)గా నమోదైంది.
సెన్సెక్స్ ఉదయం 368 పాయింట్ల (క్రితం ముగింపు 83,871.32) లాభంతో 84,238.86 వద్ద ప్రారంభమైంది. కొనుగోళ్ల మద్దతుతో రోజంతా లాభాల్లోనే కదలాడిన సూచీ, ఇంట్రాడేలో 84,652.01 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 595.19 పాయింట్ల లాభంతో 84,466.51 వద్ద ముగిసింది. నిఫ్టీ 180.85 పాయింట్లు పెరిగి 25,875.80 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 25,781.15- 25,934.55 పాయింట్ల మధ్య కదలాడింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ