
తెలంగాణ, 13 నవంబర్ (హి.స.)
ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని అచ్చంపేట ఎమ్మెల్యే, డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సూచించారు. నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని గురువారం ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అచ్చంపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తూ మారుమూల ప్రాంతమైన లింగాల మండల కేంద్రం ప్రజలకు ఎలాంటి కంటి చికిత్సతో బాధపడకుండా ఉచిత కంటి చికిత్స శిబిరాన్ని నిర్వహించినందుకు అండపల్లి జలంధర్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ అనూష ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వారు మరెన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు