
హైదరాబాద్, 13 నవంబర్ (హి.స.)
కొండగట్టు దేవస్థానంలో ఆర్జిత సేవల రుసుమును భారీ పెంచడం పట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఇవాళ ఓ ప్రకటనను విడుదల చేశారు. కొండగట్టు ఆలయంలో కనీస సౌకర్యాలు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మొదట మౌలిక వసతుల కల్పన మీద ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. ఆలయ అభివృద్ధిని విస్మరించడమే కాకుండా ఆర్జిత సేవా రుసుము పేరుతో అడ్డగోలుగా ధరలు పెంచడమేంటని ప్రశ్నించారు. అనంతరం ఆయన దేవాదాయ శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడి.. ఆర్జిత సేవా రుసుము పెంపుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. భక్తులు ఇబ్బందుకులను పట్టించుకోరా.. అని ప్రశ్నించారు. తక్షణమే పెంచిన ఆర్జిత సేవా రుసుమును తగ్గించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు