
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}దిల్లీ, , 13 నవంబర్ (హి.స.)body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
దిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు (Delhi Bomb Blast)కు సంబంధించి మరో కీలక విషయం బయటపడింది. ఈ పేలుడుకు కారణమైన కారులో లభించిన నమూనాలతో డాక్టర్ ఉమర్ నబీ (Dr Umar Un Nabi) డీఎన్ఏ మ్యాచ్ అయినట్లు తెలుస్తోంది. ఫోరెన్సిక్ ల్యాబ్ ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
ఎర్రకోట వద్ద పేలుడుకు ముందు ఉమర్ కారు నడుపుతున్న సీసీటీవీ దృశ్యాలను అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే. దీంతో ఘటన సమయంలో కారులో ఉన్న ఉమర్ కూడా ప్రాణాలు కోల్పోయి ఉంటాడని అధికారులు అనుమానించారు. ఈ క్రమంలోనే పుల్వామాలోని అతడి కుటుంబసభ్యుల నుంచి డీఎన్‌ఏ నమూనాలు తీసుకొని పరీక్షించారు. తాజాగా కారు నుంచి లభ్యమైన డీఎన్‌ఏ ఉమర్ నబీదేనని తేలినట్లు తెలుస్తోంది. దీంతో పేలుడు జరిగే సమయానికి అతడు వాహనంలోనే ఉన్నాడని అధికారులు నిర్ధరించినట్లు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ