
ఖమ్మం, 13 నవంబర్ (హి.స.)
ఖమ్మం జిల్లా ముదిగొండ మండల పరిధిలోని గంధసిరి గ్రామంలో కాకతీయుల కాలం నాటి శ్రీ సుందర మౌలేశ్వర స్వామి పురాతన ఆలయ పునర్నిర్మాణ పనులకు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రెండు కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ సందర్బంగా గురువారం గంధసిరి గ్రామంలో ఏర్పాటు చేసిన శంకుస్థాపనకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. భట్టి విక్రమార్కకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. గ్రామస్తులు నిర్వహించిన ర్యాలీలో పాల్గొని గుడి వద్దకు చేరుకుని భూమి పూజ నిర్వహించారు. ఆయన వెంట ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, కమిషనర్ ఆఫ్ పోలీస్ సునీల్ దత్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు