
హైదరాబాద్, 13 నవంబర్ (హి.స.) తాండూరు పట్టణాన్ని కేంద్రంగా చేసుకొని నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించి చలామణి చేస్తున్న గ్యాంగ్ను సౌత్ వెస్ట్ జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో మొత్తం 8 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సౌత్ జోన్ పోలీస్ కమిషనర్ చంద్రమోహన్ తెలిపారు.
ప్రధాన నిందితుడు కస్తూరి రమేష్ బాబు తన సోదరి కె. రామేశ్వరి సహాయంతో తాండూరులోని తన ఇంట్లో నకిలీ నోట్ల ముద్రణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నకిలీ నోట్లను ముద్రించి, బ్లేడ్ సహాయంతో అసలు నోట్ల సైజ్కి కట్ చేసేవారు. ఈ నకిలీ నోట్లను మార్కెట్లో చలామణి చేయాలని యత్నిస్తుండగా పోలీసులు గోప్య సమాచారం ఆధారంగా దాడి చేసి ముఠాను పట్టుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..