విశాఖపట్నంలో.వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణానికి.నేడు శంకుస్థాపన
విశాఖపట్నం, 13 నవంబర్ (హి.స.)విశాఖపట్నంలో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ నిర్మాణానికి గురువారం శంకుస్థాపన జరగనుంది. పెట్టుబడిదారుల సదస్సు కోసం ఒకరోజు ముందుగా విశాఖకు వస్తున్న మంత్రి లోకేశ్‌ చేతులు మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. ఎండాడలో పనోరమ హిల్స్‌ వెనుక
విశాఖపట్నంలో.వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణానికి.నేడు శంకుస్థాపన


విశాఖపట్నం, 13 నవంబర్ (హి.స.)విశాఖపట్నంలో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ నిర్మాణానికి గురువారం శంకుస్థాపన జరగనుంది. పెట్టుబడిదారుల సదస్సు కోసం ఒకరోజు ముందుగా విశాఖకు వస్తున్న మంత్రి లోకేశ్‌ చేతులు మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. ఎండాడలో పనోరమ హిల్స్‌ వెనుక పది ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసే ఈ ప్రాంతంలో పెద్ద స్టార్‌ హోటల్‌, ఆఫీసు స్పేస్‌తో పాటు కోవర్కింగ్‌ స్పేస్‌ వస్తాయి. మొత్తం రూ.1,250 కోట్లు పెట్టుబడి పెట్టనున్న ఈ ప్రాజెక్టులో సుమారు 15 వేల మందికి ఉపాధి లభిస్తుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande