రేపే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం.. కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి
హైదరాబాద్, 13 నవంబర్ (హి.స.) జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడి కానున్నవి. యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుందని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. తొలుత బ్యాలెట్
జూబ్లీహిల్స్ కౌంటింగ్


హైదరాబాద్, 13 నవంబర్ (హి.స.) జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడి కానున్నవి. యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుందని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. తొలుత బ్యాలెట్ ఓట్లు లెక్కించి ఆ తర్వాత ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తామని తెలిపారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన..10 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేస్తామని సాధారణంగా ఓట్ల లెక్కింపుకు 14 టేబుల్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటే ఇక్కడ స్పెషల్ పర్మిషన్ తో ఈసారి 42 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. 407 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు.

ఒకటో నెంబర్ పోలింగ్ బూత్ షేక్ పేట డివిజన్ నుంచి ప్రారంభమై ఎర్రగడ్డతో ముగియనుంది. కాగా.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 1,94,631 ఓట్లు పోలయ్యాయి.. 99,771 మంది పుషులు, 94,855 మంది స్త్రీలు ఓటు వేశారు. ఇతరులు ఐదుగురు ఓటు వేయగా.. మొత్తం 48.49% పోలింగ్ శాతం నమోదైంది..

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande