
చతిస్గడ్, 13 నవంబర్ (హి.స.) ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్ కేసు కేసులో
కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్కు చెందిన రూ.61.20 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాత్కాలికంగా అటాచ్ చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA)-2002 ప్రకారం ఈ చర్య తీసుకున్నట్టు ఈడీ ఈ రోజు వెల్లడించింది. ఈ ఆస్తులు ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్పై జరుగుతున్న దర్యాప్తుతో సంబంధమున్నవని అధికారులు గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ రోజు విడుదల చేసిన ఈడీ ప్రకటన ప్రకారం.. అటాచ్ చేసిన ఆస్తుల్లో రూ.59.96 కోట్ల విలువైన 364 నివాస ప్లాట్లు, వ్యవసాయ భూములు వంటి స్థిరాస్తులు ఉన్నాయి. అదనంగా రూ.1.24 కోట్ల విలువైన బ్యాంక్ ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి చరాస్తులను కూడా సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు