
అమరావతి, 13 నవంబర్ (హి.స.)
పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంలోని శ్రీదేవి భూదేవి సమేత బాల వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆలయ ఆవరణలో పులిహోర, పండ్లు, మిఠాయిలు, పుష్పాలతో స్వామివారి రూపంలో సర్వాంగ సుందరంగా అలంకరించి నైవేద్యం సమర్పించారు. అనంతరం భక్తులకు ఆ నైవేద్యం పంచిపెట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ